కృష్ణా: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు ఈ వారంలో విడుదల కానున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. హాల్ టికెట్లు కేవలం అధికారిక వెబ్సైట్లోనే ఉంటాయని, అనధికారిక సైట్లను నమ్మవద్దని హెచ్చరించారు. bre.ap.gov.in, WhatsApp Governance 9552300009 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.