NDL: కొత్తపల్లి మండలం గుమ్మడాపురం గ్రామ పొలిమేరలోని భూములు ఆన్లైన్లో నమోదు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములు నమోదు కాకపోవడంతో ప్రభుత్వం నుంచి పథకాలు, పరిహారాలు అందడం లేదని వాపోతున్నారు. సమస్య పరిష్కారం కోసం సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.