నెల్లూరు: నగరంలోని 53వ డివిజన్ పరిధిలో మేయర్ సుజాత అశోక్ పర్యటించి పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీల పూడికతీత, ఫాగింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజల పట్టాల సమస్యను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అలాగే PM ఆవాస్ యోజన 2.0 ద్వారా అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని మేయర్ హామీ ఇచ్చారు.