»Alia Bhatt Sent A Special Gift To Ram Charans Wife Upasana
Ram Charan: భార్య ఉపాసనకు అలియా భట్ స్పెషల్ గిఫ్ట్
తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న తన RRR సహ నటుడు రామ్ చరణ్(ram charan) భార్య ఉపాసన(Upasana) కొణిదెలకు.. బాలీవుడ్ నటి అలియా భట్(Alia Bhatt) సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించింది. మెటర్నిటీ దుస్తులను పంపించిన చిత్రాలను ఈ మేరకు తన ఇన్ స్టాలో పంచుకుంటూ వెల్లడించింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్(Ram Charan) భార్య ఉపాసన(Upasana) ప్రస్తుతం గర్భవతి అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం చరణ్‌కి తన పర్సనల్ లైఫ్‌లో చాలా గుర్తుండిపోతుందని చెప్పవచ్చు. పెళ్లయిన పదేళ్ల తర్వాత చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఉపాసనపై ఉంది. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఊహించని బహుమతితో ఉపాసనను ఆశ్చర్యపరిచింది. ఉపాసనకు అలియా గిఫ్ట్ పంపింది. ఉపాసన ఆలియా(Alia Bhatt) నుంచి గిఫ్ట్ అందుకున్నందుకు సంతోషిస్తూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంది.
అలియా భట్(Alia Bhatt) ప్రస్తుతం ‘ఎడ్ ఎ మమ్మా’ అనే తన సొంత దుస్తుల బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తోంది. అలియా భట్ ఇటీవలే ప్రత్యేకమైన బేబీ, మెటర్నిటీ వేర్లతో వ్యాపారవేత్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అంతేకాదు భట్ తన ఇండస్ట్రీ స్నేహితులకు బహుమతులు పంపడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా గౌహర్ ఖాన్, బిపాసా బసు, సోనమ్ కపూర్ లకు పంపించింది. దీంతోపాటు ఇటీవల ఎన్టీఆర్ పిల్లలకు కూడా ఈ బ్రాండ్ నుంచి బహుమతులు పంపింది. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారకు కూడా ఇదే బ్రాండ్ దుస్తులను బహుమతిగా ఇచ్చింది.
ఇటీవల రామ్‌చరణ్ ఉపాసన శ్రీమంతం వేడుకను దుబాయ్(dubai)లో గ్రాండ్‌గా జరుపుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన భార్యతో సమయం గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అలియా భట్, రామ్‌చరణ్ ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పవచ్చు.
మరోవైపు అలియా భట్(Alia) ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన చిత్రం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో రణవీర్ సింగ్ సరసన నటిస్తుంది. ఆమె కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రాతో కలిసి జీ లే జరాలో కూడా నటించనుంది. అంతే కాకుండా ఈ ఆగస్టులో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రంతో అలియా భట్ హాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయనుంది.