»Tdp Leader Pattabhi Ram Comments On Jagan Who Gave Electricity Tenders To Benami And Squeezed Thousands Of Crores
Pattabhi Ram: విద్యుత్ టెండర్లు బినామీలకే ఇచ్చి జగన్ వేల కోట్లు నొక్కేశారు
విద్యుత్ మీటర్ల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) 13 నుంచి 14 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రాం(tdp leader Pattabhi Ram) ఆరోపించారు. ఆ క్రమంలో మీటర్ల కాంట్రాక్టులు మొత్తం బినామీలకే ఇచ్చుకున్నట్లు గుర్తు చేశారు.
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) మరో స్కీం పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(Pattabhi Ram)ఆరోపించారు. జగన్ రెడ్డి డీపీటీ స్కీం గురించి చేసిన దోపిడీ ఆధారాలతో అందిరికీ తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో విద్యుత్ మీటర్లు బిగించే వ్యవహరంలో వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని పట్టాభిరామ్ అన్నారు. ఆ క్రమంలో వారికి తెలిసిన వారికి చెందిన బినామీ కంపెనీలకే 13 నుంచి 14 వేల కోట్ల రూపాయల విద్యుత్ టెండర్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఒక్క APSPDCL పరిధిలోనే 4 వేల కోట్లకుపైగా స్కాం జరిగిందని ఆరోపించారు.
అసలు ఆర్డీఎస్ఎస్ స్కీం కింద టెండర్లు పిలిచి.. ఓ భవన నిర్మాణ కంపెనీకి విద్యుత్ సంస్థ టెండర్లు ఎలా ఇస్తారని ఈ మేరకు పట్టాభిరామ్ సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు అనేక మార్గాల్లో దోచుకున్న డబ్బుతో జగన్ రెడ్డి మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ వేస్తున్నారని పట్టాభిరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏపీలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు.
మరోవైపు వైఎస్ఆర్సీపీ(YSRCP) అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రంగానికి నష్టం జరిగిందని పట్టాభిరామ్ అన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు, డీస్కామ్లపై మొత్తం అప్పులు రూ.13,834 కోట్లు ఉండగా..ప్రస్తుతం 20 వేల కోట్లు ఎప్పుడో దాటేశాయని గుర్తు చేశారు. మరోవైపు జగనన్న కాలనీల పేరుతో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రాం ఆరోపించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కమ్‌లకు ఏ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ఇంత భారీ రుణం ఇస్తుందని ప్రశ్నించారు. మరోవైపు ఇప్పటికే రుణ చెల్లింపుల్లో రాష్ట్రాన్ని డిఫాల్టర్‌గా కేంద్ర ఆర్థిక సంస్థలు ప్రకటించాయని గుర్తు చేశారు.