TPT: గూడూరు 2వ పట్టణ పరిధిలో రాపూరు రోడ్డులో మాసు వద్ద ఉన్న నీటి సరఫరా పైప్లైన్ దెబ్బతినడంతో బుధవారం ఒకటవ పట్టణ పరిధిలో మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. యథాతథంగా గురువారం పట్టణంలో మంచినీటి సరఫరా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.