TPT: ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే POLYCET–2026 పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన లేదా ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 4 కాగా, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 28న నిర్వహించనున్నారు.