యాదాద్రి: వలిగొండ మండలం టేకులసోమారం శివారులో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వ్యవసాయ భూమిలో అడుగులను చూసి పులి అడుగులే అని వారు భయపడుతున్నారు. దీంతో జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణిని వివరణ కోరగా అది పులి కాదని తమ అటవీ శాఖ సిబ్బందిని పంపిస్తామని తెలిపారు. దీంతో వారు ఊపిరీ పీల్చుకున్నారు.