VZM: బొబ్బిలి మండలంంలోని కోమటిపల్లి సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మంగళవారం వేకువ జామున సుమారు 3 గంటల సమయంలో వ్యక్తి మృతి చెందాడన్నారు. రైలు నుంచి జారిపడ్డాడా ? రైలు ఢీ కొట్టిందా ? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉందన్నారు.