KDP: సింహాద్రిపురం మండలంలోని బిధినంచెర్లలోని ప్రధాన రోడ్డు చెరువును తలపిస్తుంది. ప్రధాన రోడ్డులో వర్షపు నీటితో పాటు పైప్ లైన్ లీకేజీ నీరు ఆక్కడికి చేరడంతో మురికికుంటలా మారింది. దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రధాన రోడ్డుపై నీరు నిలవకుండా చూడాలని వారు కోరుతున్నారు.