VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్ తారక్ నాథ్ లంచం తీసుకుంటూ ACB అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు. పట్టణ పరిధిలోని పద్మశాలి వీధిలో నివసిస్తున్న బురిడి మహేష్ ఇంటి నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ కోసం కమిషనర్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆయన ఏసీబీను ఆశ్రయించగా.. మున్సిపల్ కార్యాలయంలోని రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడ్డారు.