SRD: ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఎస్సైలు మల్లయ్య, షేక్ షాబుద్దీన్లను ఎస్పీ కార్యాలయంలో మంగళవారం సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ.. వీరిద్దరూ పోలీస్ శాఖలో విశేష సేవలు అందించినట్టు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, ఎవో కళ్యాణి పాల్గొన్నారు.