KMM: నగరంలోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలో టీచర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన నియమించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి పురందర్ మంగళవారం తెలిపారు. జూ.లెక్చరర్-1, బయో సైన్స్-1కు మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. సంబంధిత సబ్జెక్టులో PG, BED 50%తో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. జిల్లా కలెక్టరేట్లో ఈనెల 18 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.