NLR: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న శిక్షణ ద్వారా వ్యాపారంలో మెళకువలను పెంపొందించుకోవాలని కమిషనర్ నందన్ సూచించారు. మెప్మా ఆధ్వర్యంలో ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద స్మార్ట్ స్ట్రీట్ వెండర్స్‌కు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించారు. నిరుపేద మహిళలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే మా లక్ష్యం అన్నారు.