NZB: మోపాల్ మండలంలోని కంజర, బాడ్సి, మంచిప్ప గ్రామాలకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా కోసం నిర్మించిన నూతన లైన్ను ఎమ్మెల్యే భూపతి రెడ్డి మంగళవారం బాడ్సి సబ్ స్టేషన్లో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.