JGL: ఎండపల్లి మండలం కొత్తపేటలో జరిగే పోచమ్మతల్లి, పోతురాజు, నాభిశిల(బొడ్రాయి), భూలక్ష్మీ మహాలక్ష్మీ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను ఆహ్వానించారు. ఆలయ అర్చకులు, గ్రామస్థులు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.