NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న చేసిన వ్యాఖ్యలను కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఖండించారు. ప్రసన్న వాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. రాజకీయంగా విమర్శలు చేయలేక, మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్నారు. రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగత దూషణలు తగవన్నారు.