W.G: ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ సీఐటీయూ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం సమతా నగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు రాజశేఖర్‌కు ఆశా వర్కర్లతో కలిసి సమ్మె నోటీస్ అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పెంకి అప్పారావు, ఆశా వర్కర్లు రామలక్ష్మి, మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు.