ATP: సింగనమల మండలం సోధన పల్లి రైతు సేవా కేంద్రంలో మంగళవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమంపై మండల వ్యవసాయ అధికారి అన్వేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగుచేసిన, చేయబోతున్న పంటలకు భీమా ప్రీమియం చెల్లించాలని సూచించారు. అన్నదాత సుఖీభవ లబ్ది పొందడానికి ఏమైనా సందేహాలు ఉంటే రైతులు వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలన్నారు.