AP: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో రేపు జగన్ పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే 375 మందికి నోటీసులు ఇచ్చారు. ఇది కేవలం రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే అని SP మణికంఠ చందోలు తెలిపారు. కొంతమంది జన సమీకరణ చేసి బహిరంగ సభలా మార్చాలని చూస్తున్నారని, ఇలా చేస్తే వారిపై సాక్ష్యాధారాలతో సహా కేసులు నమోదు చేసి రౌడీషీట్ నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.