AKP: నర్సీపట్నం అభివృద్ధి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నాయకత్వంలోనే సాధ్యమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. మంగళవారం నర్సీపట్నం టీడీపీ కార్యాలయంలో నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధి రూపొందించిన 4 పేజీల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఒక్క ఏడాదిలోనే రూ. 311కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని విజయ్ చెప్పారు.