ప్రకాశం: ముండ్లమూరు మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరాకు మెరుగైన చర్యలు చేపట్టాలని ఎంపీడీవో శ్రీదేవి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా త్రాగునీటి సరఫరా చేయాలన్నారు.