JGL: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 3నెలల్లో ప్రభుత్వాసుపత్రులలో డెలివరీల సంఖ్య తక్కువగా ఉందని, సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు.