SKLM: టెక్కలి మండలం ఎమ్మార్వో సత్యంను బీజేపీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు రాంజీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు నరేంద్ర చక్రవర్తి, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.