SKLM: రణస్థలం మండల కేంద్రంలో వైయస్సార్ 76వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు