TG: బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌తో రాజకీయం చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. ‘తెలంగాణ అంటే BRS అనే విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్లకు అనుకూలంగా ఉంటే తెలంగాణ మీడియా లేదంటే ఆంధ్రా మీడియా. కాంగ్రెస్ మీద కోపాన్ని టీవీ ఛానళ్లపై చూపిస్తే ఎలా? చేసిన తప్పులను ప్రసారం చేయవద్దంటే ఎలా? రాష్ట్రంలో ఈ బీహార్ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది’ అని ప్రశ్నించారు.