ATP: గుంతకల్లు నుంచి విజయవాడకు నేడు RTC బస్సును ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజరు గంగాధర్ తెలిపారు. ఉరవకొండలో సా.6:30 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు రా.7:15కు చేరుకుంటుందన్నారు. గుత్తి, కర్నూలు మీదుగా విజయవాడకు మరుసటి రోజు ఉ.6:40కు చేరుకుంటుంది. తిరిగి విజయవాడలో రా.7:30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం గుంతకల్లుకు చేరుకుంటుందన్నారు.