TG: పదేళ్ల బీఆర్ఎస్ పాలన వైఫల్యాలతో సాగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘గతంలో ఉన్న పథకాలను కొనసాగిస్తూ.. అదనపు పథకాలు తీసుకొచ్చాం. మేము వచ్చాక 3,500 ఇళ్లు మంజూరు చేశాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే BRS నేతలు ఓర్వలేకపోతున్నారు. మేం చర్చకు వెనక్కి వెళ్లటం లేదు.. అసెంబ్లీలో చర్చకు రండి. స్పీకర్‌కు లేఖ రాసి అసెంబ్లీని సమావేశపరచమని కోరండి’ అని తెలిపారు.