TG: ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపిన దారుణ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పిట్టలగూడెంకు చెందిన కనకయ్య మద్యం మత్తులో తన ఇద్దరు భార్యలపై గొడ్డలితో దాడికి యత్నించాడు. ఈ క్రమంలో వారిద్దరు కలిసి కనకయ్యను తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, కనకయ్య ఇటీవల తన అత్తను చంపిన కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.