TG: హైడ్రాకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమ వెంచర్లు కనిపించటం లేదా..? అని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో స్థానికులతో కలసి కవిత ఆందోళన చేశారు. మూసీ నది పక్కన నిర్మిస్తున్న అపార్ట్మెంట్పై కవిత ఆరోపణలు చేశారు. మూసీని ఆనుకుని భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మిస్తున్నారని ధర్నా చేపట్టారు.