NDL: ఆల్ ఇండియా పర్మిట్ లేని బస్సులపై డోన్ MVI క్రాంతికుమార్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రోడ్డు పన్ను చెల్లించని ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుపై రూ. 2.09 లక్షల భారీ జరిమానా విధించి, బస్సును ఆర్టీసీ డిపోకు తరలించారు. అలాగే, పత్రాలు లేని ఆరు సరుకు రవాణా వాహనాలపై సుమారు రూ. 30,000 జరిమానా విధించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు.