VSP: జ్ఞానాపురంలో మంగళవారం ఉదయం బలమైన గాలులకు ఓ భారీ చెట్టు కొమ్మ విద్యుత్ తీగలపై పడింది. దీంతో కరెంటు వైర్లు కిందకు వేలాడటంతో స్థానికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ ఘటన జ్ఞానాపురం మెయిన్ రోడ్డులో చోటుచేసుకుంది. తెగిన వైర్ల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.