ATP: గుంతకల్లు మండలం వైటి చెరువు గ్రామంలో గ్రామ సర్పంచ్ సోనియా తండ్రి గోవింద్ మృతి చెందాడు. మంగళవారం విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా యువ నాయకుడు మంజునాథరెడ్డి వారి స్వగ్రామానికి వెళ్లి గోవింద్ భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు.