TPT: విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీల అరెస్టులను ఖండిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం నాయుడుపేటలో నిరసన చేపట్టారు. సీఐటీయూ కార్యాలయం నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, కళ్లకు చేతులు అడ్డం పెట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేదంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు.