విశాఖ బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLC సోము వీర్రాజు పాల్గొని జెండా ఆవిష్కరించారు. దేశ రాజకీయాల్లో అవినీతి నిర్మూలన లక్ష్యంగా బీజేపీ ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. అలాగే, బీజేపీ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను నాయకులకు వివరించారు.