ASR: ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల్లో సాగవుతున్న జీడిమామిడికి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ఆదివాసీ జేఏసీ కోరింది. మంగళవారం ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు వారు వినతిపత్రం అందజేశారు. అలాగే, దేవీపట్నం మండలంలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉన్న తోటల్లో జీడిగింజలు కోసేందుకు గిరిజనులకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు.