ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి (chief minister of andhra pradesh ys jagan) వ్యతిరేకంగా మాట్లాడిన సామాన్యులపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు (minister dharmana prasada rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకున్న వారికి సంస్కారం లేకుంటే ఎలా అంటూ డ్వాక్రా మహిళల (Dwakra Mahilalu)పైన ఒకింత అసహనం వ్యక్తం చేసారు. శ్రీకాకుళంలో (Srikakulam) జగనన్న ఆసరా పంపిణీ (jagananna asara) కార్యక్రమాల్లో పాల్గొని, లబ్ధిదారులకు చెక్కులు అందించారు ఆయన. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను మొన్న ఓ చోట నుండి జగనన్న ఆసరా పంపిణీ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తూ, ఓ మహిళ… ఆసరా డబ్బులు జగన్ ఇంట్లో నుండి ఇస్తున్నాడా అని అంటోందని, తిన్నది తిరగబోసుకోవడం అంటే ఇదేనని, సంస్కారం లేకుంటే ఎలా.. ఎం మనుషులో ఏమో.. పద్దుకు మాలిన వ్యక్తుల్లా మాట్లాడితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలు తీసుకుని ఓటు వేయకపోతే మీ చేతిని మీరు నరుక్కున్నట్లే అన్నారు.
సాధారణంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే ఫథకాలు ఏవీ కూడా ఆయా రాజకీయ నాయకులు ఇళ్లలో నుండి ఇవ్వరు. ట్యాక్స్ పేయర్స్ మొదలు వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఇస్తారు. అందుకే సదరు మహిళ.. జగన్ ఇంట్లో నుండి ఇస్తున్నాడా అని వ్యాఖ్యానించి ఉండవచ్చు. అయితే ఈ వ్యాఖ్యలపై ధర్మాన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ… ఒకరు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని ప్రచారం చేస్తారని, ధరలు పెరగడానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ప్రపంచమంతా ధరలు పెరుగుతున్నాయన్నారు. జగన్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రేమను తగ్గించేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారన్నారు. 2014లో చంద్రబాబుకు అధికారం ఇస్తే మోసం చేశారని, జగన్ మాత్రం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారన్నారు.