నిర్మల్: లోకేశ్వరం మండల కేంద్రంలో కొమరాంభీమ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. మంత్రి సీతక్కతో పాటు ఆదిలాబాద్ మాజీ ఎంపీ బాపూరావు హాజరైయ్యారు. ముందుగా మండల కేంద్రానికి చేరుకున్న నాయకులకు స్థానిక ఆదివాసులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. బీజేపీ ప్రభుత్వం ఆదివాసులను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తుందని బాపూరావు అన్నారు.