KRNL: పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో గుడేకల్ తహేరా బీ అనే మహిళపై దున్నపోతు మంగళవారం దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కూరగాయల కోసం వెళుతున్న తహేరా బీ పై ఒక్కసారిగా దున్నపోతు కొమ్ములతో కుమ్మేయడంతో రెండు కాళ్లకు, చేయికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. గ్రామంలో దున్నపోతు హల్ చల్ చేసింది. తీవ్రంగా గాయపడిన మహిళను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆదోనికి తరలించారు.