ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది. పురుషుల 20 కి.మీ నడకలో సెర్విన్ సెబాస్టియన్ (1 గంట 21 నిమిషాల 13.60 సెకన్లు) కాంస్యం సాధించాడు. చైనాకు చెందిన వాంగ్ జావోజావో (1 గంట 20 నిమిషాల 36.90 సెకన్లు) స్వర్ణ పతకం అందుకున్నాడు. జపాన్‌కు చెందిన కెంటో యోషికావా (1 గంట 20 నిమిషాల 44.90 సెకన్లు) రజతం దక్కించుకున్నాడు.