KMM: జిల్లాలోని భవిత కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో భవిత కేంద్రాల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజతో కలిసి సమీక్షించారు. జిల్లాలో 8 భవిత కేంద్రాలు, 14 నాన్ భవిత కేంద్రాలు ఉన్నాయని, అందులో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు.