KRNL: ప్రజలకు రేషన్ సరుకులు సక్రమంగా అందేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని చాణిక్యపురి కాలనీలో ఉన్న సివిల్ సప్లయిస్ మండల స్థాయి స్టాక్ పాయింట్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూకాల్లో ఎలాంటి తేడాలు ఉండకూడదని సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.