KRNL: కర్నూలు నగరంలో ఉన్న శిశు గృహ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం శిశు గృహ కేంద్రంలోని పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పిల్లలకు చాక్లెట్లను అందజేశారు.