Vsp: సరస్వతీ నది పుష్కరాలు, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు శ్యామల అమ్మవారి జాతరకు ప్రత్యేక బస్సులు నడపడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం లభించిందని విశాఖపట్నం డిపో మేనేజర్ గంగాధర్ రావు సోమవారం తెలిపారు. శ్యామలాంబ జాతరకు పది ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.1,87,670, సరస్వతి దేవి పుష్కరాలకు మూడు సర్వీసులు ద్వారా 2,73,100 ఆదాయం సమకూరిందని చెప్పారు.