KDP: మైదుకూరు పట్టణం నంద్యాల రోడ్లోని పశువుల సంత సమీపంలో గుర్తుతెలియని ఆటో ఢీకొనడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ఢీకొనడం వలన తలకు బలమైన గాయాలు తగిలి రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన యువకున్ని గమనించిన టీడీపీ నాయకులు కిషోర్ తదితరులు మైదుకూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదంలో ఈ యువకుడు స్పృహ తప్పడంతో అతని ఆచూకీ తెలియలేదు.