TPT: కుప్పంలో రైతులు పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గంలో సగానికిపైగా కుటుంబాలు పంటలపై ఆధారపడి జీవిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా టమాటా, బీరకాయ వంటి ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోత కూలీలు కూడా రావడం లేదన్నారు. దీంతో తాము తీవ్రంగా నష్ట పోతున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.