అసోం కాంగ్రెస్ చీఫ్గా లోక్సభ ఎంపీ గౌరవ్ గొగొయ్ని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. భుపెన్ కుమార్ బోరా స్థానంలో నియమితులైన గొగొయ్, అసోం మాజీ సీఎం తరుణ్ గొగొయ్ కుమారుడు. వచ్చే ఏడాది జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. జోర్హాట్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన గౌరవ్ గొగొయ్ ఈ కీలక పదవిని చేపట్టారు.