ముంబైపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించి, నేరుగా క్వాలిఫయర్-1కు అర్హత పొందింది. ప్రియాంశ్ ఆర్య (62), ఇంగ్లిస్ (73) అద్భుత బ్యాటింగ్‌తో MI నిర్ధేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించారు. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి చేరింది. మరోవైపు ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ టాప్-2 రేసు నుంచి వైదొలగి, ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది.