అల్లూరి: అరకు పంచాయతీ కేంద్రంలో గట్టుచప్పుడు కాకుండా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. గిరిజనేతరులు అక్రమంగా శాశ్వత దుకాణాలు నిర్మిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1/70 చట్టానికి విరుద్ధంగా ఇవి చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.