VSP: రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని గోపాలపట్నం శాంతి భద్రతల విభాగం స్టేషన్ సీఐ ఎన్.వి.ప్రభాకర్ రావు అన్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఆదేశానుసారం రౌడీ షీటర్స్కు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.